గూగుల్​పై సీసీఐ మరో దర్యాప్తు

గూగుల్​పై సీసీఐ మరో దర్యాప్తు

న్యూఢిల్లీ: న్యూస్​ కంటెంట్​ రెవెన్యూ పంపకం విషయంలో సక్రమంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలపై గూగుల్ మీద మరో దఫా కాంపిటీషన్​ కమిషన్​ దర్యాప్తుకు ఆదేశించింది. ఇప్పటికే గూగుల్​పై నడుస్తున్న రెండు కేసులతో కలిపి తాజా కేసునూ దర్యాప్తు చేయనున్నట్లు కాంపిటీషన్​ కమిషన్ వెల్లడించింది. న్యూస్​ బ్రాడ్​కాస్టర్స్​ అండ్​ డిజిటల్​ అసోసియేషన్​ దాఖలు చేసిన కంప్లెయింట్​ ఆధారంగా తాజా దర్యాప్తుకు సీసీఐ ఆదేశాలిచ్చింది.

ఈ ఏడాది జనవరి నెలలో డిజిటల్​ న్యూస్​ పబ్లిషర్స్​ అసోసియేషన్​ ఫైల్​ చేసిన కంప్లెయింట్​పై అప్పట్లో దర్యాప్తుకు ఆదేశించింది. ఆ తర్వాత ఇలాంటి కేసునే ఇండియన్​ న్యూస్​ పేపర్​ సొసైటీ  దాఖలు చేసింది. ఈ కేసులన్నింటినీ దర్యాప్తు చేసి తమ డైరెక్టర్​ జనరల్​ రిపోర్టు సబ్మిట్​ చేయనున్నట్లు కాంపిటీషన్​ కమిషన్​తాజాగా ప్రకటించింది. సరయిన రెమ్యూనరేషన్​ చెల్లించకుండానే న్యూస్​ కంటెంట్​ను పొందుతోందని గూగుల్‌పై బ్రాడ్‌కాస్ట్    అసోసియేషన్  ఆరోపణలు చేస్తోంది.