టెర్రరిజం అణచాలంటే అమెరికా పాలసీనే మేలు

టెర్రరిజం అణచాలంటే అమెరికా పాలసీనే మేలు

న్యూఢిల్లీ: టెర్రరిజంపై పోరు ఇంకా ముగిసిపోలేదని చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్​ రావత్​ చెప్పారు. టెర్రరిజాన్ని పెంచి పోషి స్తున్న దేశాలు ఉన్నంతకాలం ప్రపంచానికి ముప్పు తప్పదన్నారు.  9/11 దాడుల తర్వాత టెర్రరిస్టులపై అమెరికా ఉక్కుపాదం మోపిందని, అన్ని దేశాలు అమెరికాలా వ్యవ హరిస్తే టెర్రరిజాన్ని నియంత్రించ వచ్చన్నారు. గురువారం ఇక్కడ జరిగిన ‘రైజీనా డైలాగ్‌‌‌‌’ కార్యక్రమం లో పాల్గొన్న రావత్‌‌‌‌.. టెర్రరిస్టులకు సహకరిస్తు న్న దేశాలను టార్గెట్‌‌‌‌ చేసి, ఏకాకుల ను చేయాలని చెప్పారు. ‘కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ లో చిన్నపిల్లలు కూడా రాడికలైజేషన్‌‌‌‌ ఎదుర్కొంటు న్నారు. అలాంటి వారిని గుర్తించి డీ రాడికలైజేషన్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో వేయాలి. సైన్యం కఠిన వ్యూహాలు ఉపయోగి స్తలేదు’అని రావత్‌‌‌‌ చెప్పారు.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి