చెరువులను అభివృద్ధి చేయకుండా ఉత్సవాలా

చెరువులను అభివృద్ధి చేయకుండా ఉత్సవాలా

శాయంపేట, వెలుగు: చెరువుల అభివృద్ధికి నిధు లు కేటాయించకుండా, వాటికి రిపేర్లు చేయ కుండా చెరువుల దినోత్సవం నిర్వహించడం హాస్యాస్పదం అని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి విమర్శించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి వద్ద ఉన్న చలివాగు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గురువారం పరి శీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు మండలాలకు సాగు, తాగునీరు అం దించే చలివాగు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ రిపేర్లు చేయడం లేదన్నారు. 

Also Read :- చెరువును కబ్జా చేసిన్రు

ప్రతీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు చెప్పడం తప్పించి, గ్రామాల్లో ఉండే చెరువులను అభివృద్ధి చేసిన దాఖలాలే లేవన్నారు. పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం వృథా చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎండి వలీ హైదర్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి సుకుమార్, నాయకులు మంద సదానందం, శ్రీనివాస్, లచ్చన్న, గొడిశాల రాజేందర్, కుమారస్వామి, కొమ్ము సారంగం, బుట్టి చంద్రమోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.