చెరువును కబ్జా చేసిన్రు

చెరువును కబ్జా చేసిన్రు

అచ్చంపేట, వెలుగు: పట్టణంలోని మల్లంకుంట చెరువును మురికి కుంటగా మార్చి కబ్జాకు గురి చేశారని బీజేపీ నేత సతీశ్​ ఆరోపించారు. గురువారం పట్టణంలోని మల్లంకుంట చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మల్లమ్మ కుంటలో కబ్జాలు ఎక్కువయ్యాయని, ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా ఇండ్ల నిర్మాణాలు జరిగాయన్నారు. ఆక్రమణలను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మొక్తల రేణయ్య, మండికర్ బాలాజీ, రంగినేని రవీందర్, బట్టి జగదీశ్వర్ గౌడ్, పత్యనాయక్, దేవేందర్ రెడ్డి, అంజి, అమర్  పాల్గొన్నారు.

చెరువు కబ్జాపై ఎంపీడీవో నిలదీత

చిన్నచింతకుంట, వెలుగు:చెరువుల పండుగలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎంపీడీవో శ్రీనివాస్​రెడ్డిని మండలంలోని మద్దూరు గ్రామస్తులు నిలదీశారు.గ్రామంలోని 150 ఎకరాల చెరువును కబ్జా చేశారని, 2 నెలల కింద చెరువులోని ఏక్  ఫసల్  భూములు కొన్న వ్యక్తులు చెరువుకు వరద నీరు రాకుండా అడ్డుకట్ట వేసి కంచె నిర్మించారని తెలిపారు. ఇదంతా ఎలా జరిగిందని ఎంపీడీవోను నిలదీయడంతో, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.