గ్రీన్ ఫీల్డ్ రోడ్డు భూ నిర్వాసితులకు అండగా ఉంటాం : ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

గ్రీన్ ఫీల్డ్ రోడ్డు భూ నిర్వాసితులకు అండగా ఉంటాం : ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, వెలుగు: గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అండగా ఉంటామని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో ఎంపీ నివాసంలో కడ్తాల్, ఆమనగల్లు మండలాల పరిధిలోని ముద్విన్, ఎక్వాయి పల్లి, మర్రిపల్లి, కోనాపూర్, ఆకుతోటపల్లి గ్రామాల రైతులతో వారు సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అసెంబ్లీ ఛాంబర్ లో సీఎంతో భూ నిర్వాసితుల డిమాండ్ల పై చర్చించినట్లు వివరించారు. మరోసారి సీఎంను కలిసి నిర్వాసితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ గౌడ్, సర్పంచులు కర్ణాకర్ గౌడ్, రవి, నాయకులు కేశవులు, శ్రీరాములు, సుమన్, హరీశ్, మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నరేశ్, రైతులు పాల్గొన్నారు.