మరికల్, వెలుగు : ముదిరాజ్లు రాజకీయంగా రాణించాలని మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ కోరారు. ఆదివారం మరికల్లో మండలంలోని సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించి, ముదిరాజ్ సంఘానికి మంచిపేరు తీసుకరావాలని ఆయన కోరారు. మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు క్రాంతికుమార్, పెద్దవిజయ్కుమార్, సరఫ్ నాగరాజ్, కె.నారాయణ, గాదం మల్లేశ్, పి.శ్రీనివాస్, బొంబాయి కొండప్ప, శేఖర్, పి.నర్సింలు పాల్గొన్నారు.
