
మానకొండూరు పోలీసు స్టేషన్లో గంగారం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై సీపీ కమలాసన్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోలీసు స్టేషన్లో బర్త్ డే వేడుకలు నిర్వహించడం చాలా తప్పు అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి సంబంధిత పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.పోలీసు శాఖ ప్రతిష్ట్రకు భంగం కలిగించేవారు ఎంతటి వారైన సహించబోయేది లేదని స్పష్టం చేశారు.ఏసీపీ ఆ పై స్థాయి అధికారుతో ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు సీపీ కమలాసన్ రెడ్డి.
కరీంనగర్ లోని మానకొండూరు పోలీస్ స్టేషన్ లో ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను… సీఐ ఇంద్రసేనా రెడ్డి స్టేషన్ లోనే నిర్వహించారు. కేక్ తెచ్చి కోసి ఆయనకు తినిపించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.