అంబేద్కర్ కాలేజీలో వైభవంగా అటుకుల బతుకమ్మ

అంబేద్కర్ కాలేజీలో వైభవంగా అటుకుల బతుకమ్మ

హైదరాబాద్ సిటీలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రెండోరోజు అటుకుల బతుకమ్మ సందర్బంగా  బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో విద్యార్థులు ఆట పాటలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో కాలేజీ కరస్పాండెంట్ సరోజా వివేక్ తో పాటు... విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ కాలేజీలో విద్యార్థులకు మన సంస్కృతీ సాంప్రదాయాలు.. వాటి గొప్పతనాన్ని తెలిపేలా ప్రతి పండగను సెలబ్రేట్ చేస్తామన్నారు సరోజా వివేక్.  కాకా వెంకటస్వామి స్థాపించిన అంబేద్కర్ కాలేజీలో పేద విద్యార్థులకు చదువులు అందిస్తున్నామన్నారు. కాలేజీలో బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని స్టూడెంట్స్ అన్నారు.