అలిగిన బతుకమ్మ

అలిగిన బతుకమ్మ

బతుకమ్మ సంబరాల్లో ఆరో రోజు అంటే ఇవ్వాళ ‘ఆశ్వయుజ పంచమి’ ‘అలిగిన బతుకమ్మ, అర్రెం’ అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అందుకే పూలతో బతుకమ్మను తయారుచేయరు. గౌరమ్మకు ఎలాంటి నైవేద్యం ఉండదు. కానీ, ఆడపడుచులంతా అమ్మవారి అలక తీరాలని, ఇంటి ముందు పాటలుపాడుతూ బతుకమ్మ ఆడుతూ పూజిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మ పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో బతుకమ్మ అలిగి వెళ్లిపోయిందట. అందుకే ఆరో రోజు బతుకమ్మను పేర్చరు. నైవేద్యం పెట్టరు.