KTR బర్త్ డే ఛాలెంజ్.. ప్రముఖులు ఏమేం చేశారంటే..!?

KTR బర్త్ డే ఛాలెంజ్.. ప్రముఖులు ఏమేం చేశారంటే..!?

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. పెద్దసంఖ్యలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కేటీఆర్ బర్త్ డే రోజున… ఆయన అభిమానులు అందరూ ఏదైనా ఓ మంచి పని చేయాలని.. ఎవరికైనా సాయం చేయాలని.. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునివ్వడంతో… సెలబ్రిటీలు, టీఆర్ఎస్ నాయకులు స్పందించారు. #GiftAChallenge పేరుతో మరొకరిని నామినేట్ చేయాలని ఆయన చెప్పడంతో.. ప్రముఖులు అదే దారి ఫాలో అయ్యారు. సంతోష్ కోరడంతో… కేటీఆర్ బర్త్ డే రోజున తాము చేసిన పనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అంబటి రాయుుడు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా మీ ప్రభుత్వానికి అభినందనలు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టాలన్న మీ లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా.

చిన్న అడవినే సృష్టిస్తా- విజయ్ దేవరకొండ

కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. గిఫ్ట్ ఎ ఛాలెంజ్  స్వీకరిస్తున్నా. ఓ చిన్నపాటి అడవిని సృష్టించాలనుకుంటున్నా.

నితిన్

సినీ హీరో నితిన్ మొక్క నాటాడు. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేందుకు ఎప్పుడైనా రెడీ అనీ.. అది ఈ ప్రపంచాన్ని మరింత బాగుచేస్తుందంటే సంతోషమే అని నితిన్ ట్వీట్ చేశాడు. అభిమానులు అదే పనిచేయాలని పిలుపునిచ్చాడు నితిన్.

వంశీ పైడిపల్లి

గిఫ్ట్ ఎ చాలెంజ్ లో భాగమైనందుకు సంతోషంగా ఉందంటూ మొక్క నాటారు దర్శకుడు వంశీ పైడిపల్లి.

హరీష్ రావుతో మీకు ఉన్న అనుబంధం ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పిన సుప్రియకు థాంక్స్ అని రిప్లై ఇచ్చారు కేటీఆర్.  

హరీష్ రావు విషెస్ ట్వీట్ కు.. థాంక్స్ బావా అని రిప్లై ఇచ్చారు కేటీఆర్.

హీరో మహేశ్ బాబు, రామ్ చరణ్, ఉపాసన, సానియా మీర్జా, తమన్,  నరేష్, సినీ దర్శకుడు మెహర్ రమేశ్, వెన్నెల కిశోర్, మంచు మనోజ్, తనీష్, అడివి శేష్, హరీష్ శంకర్,

మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, జోగురామన్న, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి పద్మారావు, ఎంపీ సుజనా చౌదరి, మాజీ ఎంపీ వినోద్, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు, నేతలు కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. పారుపల్లి కశ్యప్, నిఖత్ జరీన్ కూడా విష్ చేసిన వారిలో ఉన్నారు.

హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ ప్రతినిధి కేథరిన్ హడ్డా కేటీఆర్ కు బర్త్ డే విష్ చేశారు.