సెలబ్రిటీ రిసార్ట్ ఓనర్, మేనేజర్ అరెస్ట్

సెలబ్రిటీ రిసార్ట్ ఓనర్, మేనేజర్ అరెస్ట్

శామీర్ పేట, వెలుగు: విల్లా డెవలప్ చేసేందుకు భూమి ఇచ్చిన వ్యక్తిని బెదిరించిన సెలబ్రిటీ రిసార్ట్ ఓనర్, మేనేజర్​ను శామీర్ పేట పోలీసులు అరెస్ట్​చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్​పేటలోని సెలబ్రిటీ రిసార్ట్ ఓనర్ విజయసేనారెడ్డి(69)కి అదే ఏరియాలో విల్లా డెవలప్​మెంట్ కోసం జయఈశ్వర్ అనే వ్యక్తి, అతడి కుటుంబసభ్యులు వారి భూమిని ఇచ్చారు. అప్పటి నుంచి రిసార్ట్ ఓనర్ విజయసేనారెడ్డి, మేనేజర్ హరిజోసెఫ్(49) ఇద్దరూ కలిసి జయ ఈశ్వర్ రెడ్డిని, వారి కుటుంబసభ్యులను బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో బాధితులు శామీర్ పేట పీఎస్ లో కంప్లయింట్ చేయగా.. పోలీసులు గురువారం ఆ ఇద్దరిని రిమాండ్​కు తరలించారు