రవితేజ 'వామ్మో వాయ్యో' సాంగ్ అరాచకం.. ఊపు ఊపేస్తున్న భీమ్స్ సిసిరోలియా మాస్ బీట్స్!

రవితేజ 'వామ్మో వాయ్యో' సాంగ్ అరాచకం.. ఊపు ఊపేస్తున్న భీమ్స్ సిసిరోలియా మాస్ బీట్స్!

మాస్ మహారాజా రవితేజ అంటేనే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసే రవితేజ, గతేడాది సరైన హిట్ లేకపోయినా, ఈ ఏడాది సంక్రాంతి బరిలో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో దిగుతున్నారు. క్లాస్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న విభిన్న చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ టైటిల్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన మేకర్స్..  లేటెస్ట్ గా చిత్రంలోని సెకండ్ సింగిల్‌ను విడుదల చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

అదిరిపోయిన 'వామ్మో.. వాయ్యో..' లిరికల్ సాంగ్

సినిమా ప్రమోషన్ లో  భాగంగా విడుదలైన ‘వామ్మో.. వాయ్యో..’ అంటూ సాగే రొమాంటిక్ అండ్ మాస్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మాస్ బీట్స్‌లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న భీమ్స్ సిసిరోలియా ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. స్వాతిరెడ్డి తన గొంతుతో పాటకు మరింత హుషారుని తీసుకువచ్చారు. ఈ పాటలో హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీల గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి డ్యాన్స్ మూమెంట్స్, రవితేజ సిగ్నేచర్ స్టెప్స్ మాస్ ఆడియన్స్‌కు ఐ ఫీస్ట్‌గా ఉండబోతున్నాయి. దేవ్ పవార్ అందించిన సాహిత్యం యువతను ఆకట్టుకునేలా ఉంది.

కిషోర్ తిరుమల మార్కు కామెడీ

సాధారణంగా కిషోర్ తిరుమల సినిమాలు సున్నితమైన భావోద్వేగాలతో సాగుతాయి. కానీ, రవితేజ సినిమా కావడంతో ఆయన తన శైలిని మార్చి, రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా హై-వోల్టేజ్ కామెడీని జోడించారు. భార్యాభర్తల మధ్య జరిగే సరదా పోరాటాలు, రవితేజ చేసే కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

సంక్రాంతి రేసులో..

2026 సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ, రవితేజ తనదైన మార్కు వినోదంతో పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేలా అన్ని హంగులతో ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద రవితేజ ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు..