
వ్యసనాలకు అలవాటు పడి మొబైల్ ఫోన్లు స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కమిషనర్ టాస్క్ ఫోర్స్ (నార్త్) జోన్ గోపాలపురం పోలీసుల సహకారంతో మంగళవారం ( ఆగస్టు 20) అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిందితుల నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు నిందితులను రాణిగంజ్‌కు చెందిన మహ్మద్ మస్తాన్ (22), సికింద్రాబాద్‌కు చెందిన మహ్మద్ యాకూబ్ (23), ముషీరాబాద్‌కు చెందిన సయ్యద్ మస్తాన్ (23)గా గుర్తించారు. నిందితులు పాత నేరగాళ్లేనని వారిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు.
మహమ్మద్ మస్తాన్‌పై గతంలో మలక్‌పేట్ .. ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు రెండు ఎన్‌డిపిఎస్ కేసులు నమోదై ఉన్నాయి. యాకూబ్‌పై గోపాల్‌పురం, సికింద్రాబాద్ పోలీసులు హత్య, హత్యాయత్నం సహా నాలుగు కేసులు నమోదు చేశారు. సయ్యద్‌పై ముషీరాబాద్ పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.