ఎండకు కాలిపోయిన సెల్ టవర్... ఎక్కడంటే

ఎండకు కాలిపోయిన సెల్ టవర్... ఎక్కడంటే

ఏపీలో ఎండలు మండి పోతున్నాయి.  సమ్మర్ లో ఇప్పటి వరకు పూరిళ్లు, గడ్డివాములు తగలబడటం చూశాం.  తాజాగా ఇప్పుడు భానుడి ప్రతాపానికి సెల్ టవర్లు కూడా అగ్గిపాలవుతున్నాయి.  తాజాగా విజయవాడ నగరంలోని గీతా నగర్ ఐడీఎఫ్ సీ బ్యాంకు భవనంపై ఉన్న సెల్ ఫోన్ టవర్  ఉన్నట్లుండి కాలిపోయింది. దీంతో స్దానికంగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బ్యాంకు సిబ్బందితో పాటు స్ధానికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ స్టేషన్ కు కాల్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి పరిస్ధితి అదుపులోకి తెచ్చారు. విజయవాడలో పెరిగిన వడగాల్పుల తీవ్రత కారణంగా పెరిగిన వేడికి సెల్ ఫోన్ టవర్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దట్టమైన పొగ అలుముకుంది.

వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులతో వడగాల్పుల ప్రభావం తీవ్రమవుతోంది. దీంతో సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీని ప్రభావం విజయవాడపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతీ ఏటా వేసవిలో విజయవాడలో ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతుంటాయి. ఈసారి ఈ తీవ్రత మరింత పెరిగింది. దీంతో నగరంలోని ఓ సెల్ ఫోన్ టవర్ కాలిపోయింది.