మేడారం జాతరలో రకరకాల కొత్త వ్యాపారాలు కనిపిస్తుంటాయి. కోట్లాది మంది జనం రావడంతో వారి అవసరాలను బట్టి చిరు వ్యాపారులు షాపులు పెట్టుకుంటున్నారు. జాతరలో ఎక్కువగా గుడారాల్లో ఉండే జనాలు ఫోన్ చార్జింగ్ కోసం ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొందరు చిరు వ్యాపారులు చార్జింగ్ దుకాణాలు కూడా ఏర్పాటు చేశారు. అన్ని రకాల మొబైల్ చార్జర్లు, కేబుళ్లు అందుబాటులో ఉంచి... బ్యాటరీ ఫుల్ చార్జింగ్కు రూ.50 చొప్పున తీసుకుంటున్నారు.
