మీర్ చౌక్ మృతులకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేంద్రం

మీర్ చౌక్ మృతులకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేంద్రం

హైదరాబాద్ పాతబస్తి మీర్ చౌక్ ఘటనపై పీఎం నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎక్స్ లో ట్వీట్ చేశారు.

చార్మినార్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన మృతులకు సంబంధించిన ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అదే విధంగా ఘటనలో గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఘటనా స్థలంలో ముగ్గురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో  మృతుల సంఖ్య 17 కు చేరుకుంది. ప్రమాద సమయంలో భవనలో 30 మంది ఉండగా.. 17 మంది చనిపోయారు. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.