టమాట ధరలు తగ్గించేందుకు కేంద్రం కసరత్తు

టమాట ధరలు తగ్గించేందుకు కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ, వెలుగు: టమాట రేటు భారీగా పెరిగిపోవడంతో కేంద్రం చర్యలు చేపట్టింది. ధరలను కంట్రోల్ చేసేందుకు రాష్ట్రాలకు ఫండ్స్ ఇచ్చింది. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ (పీఎస్ఎఫ్) పథకం కింద రాష్ట్రాలకు వడ్డీ లేని లోన్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీ, అస్సాం, ఒడిశా, త‌‌‌‌‌‌‌‌మిళ‌‌‌‌‌‌‌‌నాడు, వెస్ట్ బెంగాల్ లకు కలిపి కేంద్ర వాటా కింద రూ.164.15 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్ మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఫండ్స్ ను వాడుకోవడంతో పాటు.. రాష్ట్రాలు కూడా ధరలను కంట్రోల్ చేసేందుకు సొంతంగా ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలకు  టమాట పంట దెబ్బతినడంతోనే రేట్లు పెరిగాయని కేంద్రం తెలిపింది.