- పుణె, బెంగళూరు, చెన్నైకి కారిడార్లు
- దేశవ్యాప్తంగా మొత్తం 7 కారిడార్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
- పుణె, బెంగళూరు, చెన్నైకి కారిడార్లు
- దేశవ్యాప్తంగా మొత్తం 7 కారిడార్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్– చెన్నై, హైదరాబాద్–పుణె మధ్య వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటితోపాటు దేశంలో మరో 4 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లకు పచ్చజెండా ఊపారు. ఈ కారిడార్లు దేశంలోని ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడంతోపాటు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయని, ఇండస్ట్రియల్ హబ్‌లు, ఐటీ సిటీలు, టూరిజం ప్రాంతాలను బలోపేతం చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే, దేశంలోని పశ్చిమ, దక్షిణ, ఉత్తర భాగాల్లో ఆర్థిక కేంద్రాలను అనుసంధానిస్తాయన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ (508 కిలోమీటర్లు., 320 కేఎంపీహెచ్ వేగం)తో పాటు ఈ కొత్తవి దేశ రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఆధునికీకరిస్తాయని పేర్కొన్నారు.
ఏడు కారిడార్లు ఇవే..
ముంబై - పుణెహైదరాబాద్ - పుణె హైదరాబాద్ - బెంగళూరు హైదరాబాద్ - చెన్నై చెన్నై - బెంగళూరు ఢిల్లీ - వారణాసి వారణాసి - సిలిగురి
రూపాయివచ్చేది
ఇన్కమ్ ట్యాక్స్ 21 పైసలు
కార్పొరేషన్ ట్యాక్స్ 18 పైసలు
జీఎస్టీ 15 పైసలు
ఎక్సైజ్ డ్యూటీ 6 పైసలు
కస్టమ్స్ డ్యూటీ 4 పైసలు
అప్పులు, ఇతర మార్గాలు 24 పైసలు
పన్నేతర రాబడి (డిస్ ఇన్వెస్ట్‌మెంట్ వంటివి) 10 పైసలు
నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ 2 పైసలు
రూపాయి పోయేది
రాష్ట్రాల వాటా (పన్నులు, సుంకాలు) 22 పైసలు
వడ్డీ చెల్లింపులు 20 పైసలు
కేంద్ర ప్రభుత్వ పథకాలు 17 పైసలు
డిఫెన్స్ 11 పైసలు
కేంద్ర ప్రాయోజిత పథకాలు 8 పైసలు
ఫైనాన్స్ కమిషన్ , ఇతర బదిలీలు 7 పైసలు
ఇతర ఖర్చులు 7 పైసలు
సబ్సిడీలు 6 పైసలు
పెన్షన్లు 2 పైసలు
