సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటది: లక్ష్మణ్

సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటది: లక్ష్మణ్

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించానన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ నాయకులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిశానని, రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన గురించి వారికి వివరించానని చెప్పారు.

మీడియాతో మాట్లాడుతూ..  కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో సగానికి పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిందనన్నారు. 25000 ప్రభుత్వ పాఠశాలల్లో 12000 వేల పాఠశాలలను మూసివేశారన్నారు.  పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి…  బార్లను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు.  విద్యా హక్కు చట్టం ప్రకారం అందరికి చదువు అందుబాటులో ఉండాలి కానీ, సామాన్య ప్రజలను చదవకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారిస్తున్నదన్నారు. పేద విద్యార్థులు చదవకుండా చేయడమే లక్ష్యంగా… బర్రెలు, గొర్రెలు అంటూ ప్రభుత్వం పాట పాడుతుందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు మూసి వేసి… ప్రేవైట్ విద్యా సంస్థలకు లాభము చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.రాష్ట్ర బడ్జెట్ లో విద్య కోసం నిధులు కూడా సరిగ్గా కేటాయించడం లేదని ఆరోపించారు.

ఆర్టీసీ నడిపే ప్రైవేట్ డ్రెవర్ల వల్ల రోజుకొక్కరు చనిపోతున్నారని లక్ష్మణ్ తెలిపారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, కార్మికులకు నష్టం జరుగితే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉండదని ఆయన అన్నారు.

Center intervenes in RTC strike says State BJP Chief Laxman