పురుషుల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తేవాలి

పురుషుల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తేవాలి

ఖైరతాబాద్, వెలుగు: పురుషుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ డిమాండ్ చేసింది. సంస్థ ప్రతినిధులు హర్మీత్ సింగ్, కృష్ణారావు, విశ్వనాథ్ ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. మహిళల రక్షణకు చట్టాలు తెచ్చిన ప్రభుత్వాలు పురుషుల కోసం ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. పురుషుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. భార్య వేధింపులకు గురైన పురుషులు ఎవరైనా ఉంటే 88824 98498 నంబర్ ను సంప్రదించాలని, వారికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.