విద్యారంగాన్ని బలోపేతం చేసేలా కేంద్ర బడ్జెట్ : గవర్నర్ తమిళిసై

విద్యారంగాన్ని బలోపేతం చేసేలా కేంద్ర బడ్జెట్ : గవర్నర్ తమిళిసై

కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి మంచి కేటాయింపులు జరిగాయని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. విద్యారంగంలో అనేక మార్పులకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. రాజ్ భవన్లో కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరిగింది. టెక్నాలజీ, జాబ్ క్రియేషన్, నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ వంటి  వాటి వల్ల విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయని గవర్నర్ అన్నారు. డిజిటల్ లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ను పెంచేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వాక్సినేషన్ పై కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో కోవిడ్ను అదుపులోకి ఉంచగలిగామన్నారు. త్వరలోనే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. రానున్న మూడేళ్లలో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. మిల్లెట్ భోజనంపై అవగాహన పెంచుతున్నట్లు తెలిపారు.