కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 5 వేల పీజీ, 5023 MBBS సీట్ల పెంపు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 5 వేల పీజీ, 5023 MBBS సీట్ల పెంపు

 కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం రూ. 94,916 కోట్ల అభివృద్ది పనులకు  కేంద్రం ఆమోదం తెలిపింది.  ఇందులో భాగంగా   సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీ్మ్ (CSS)ఫేజ్ 3 కింద మెడికల్   సీట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది.  కేంద్ర కేబినెట్ నిర్ణయంతో  ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో భారీగా సీట్లు పెరగనున్నాయి. కొత్తగా ఐదు వేల పీజీ సీట్లు, 5023 యూజీ సీట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  

పెంచిన సీట్లు 2028-29 నాటికి పెంచిన సీట్లు అమల్లోకి తెస్తామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పెంచిన మెడికల్ సీట్ల కోసం రూ. 15034 కోట్లు కేటాయించామని చెప్పారు. మెడికల్ సీట్ల పెంపుపై త్వరలోనే మార్గదర్శకాలు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒక్కో సీటుకు కోటి 50 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతిచ్చింది కేంద్ర కేబినెట్. 2025-26 నుంచి 2028-29 వరకు ఈ రెండు పథకాల మొత్తం ఆర్థిక ప్రభావం రూ.15,034. కోట్లు.  ఇందులో  కేంద్ర వాటా రూ.10,303 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.4731 కోట్లు..

 కేంద్రం నిర్ణయంతో దేశంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం దేశంలో 808 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 1,23,700  ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. గత పదేళ్లలో 69 వేలకు పైగా మెడికల్ సీట్లు పెరిగాయి.