జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం డ్రామా: మంత్రి హరీష్ రావు

జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం డ్రామా: మంత్రి హరీష్ రావు

జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం  కొత్త డ్రామాకు తెరలేపిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. జమిలి ఎన్నికల కమిటీలో దక్షిణ భారతం నుంచి ఒక్క సభ్యుడు కూడా లేడని విమర్శించారు. ఎన్ని డ్రామాలు చేసిన  రాష్ట్రంలో బీఆర్ ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ మూడోసారి గెలిస్తేనే అభివృద్ది పరంపర కొనసాగుతుందని అన్నారు. పొరపాటున ఏ పార్టీకి ఓటు వేస్తే 24 గంవటల ఉచిత కరెంట్ కట్ అవుతుందని హరీష్ రావు తెలిపారు.

కొంతమంది డిక్లరేషన్ పేరుతో డ్రామాలు మొదలు పెట్టారని.. బీఆర్ ఎస్ ను మూడోసారి గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారని హరీష్ రావు అన్నారు. చెల్లని రూపాయికి గీతల ఎక్కువ అన్నట్లు.. చేతగాని పార్టీలకు మాటలెక్కువ అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. మేం అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం. ప్రతిపక్షాలు అబద్ధాలు చెబుతూ ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.