ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్న ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో సీఈసీ సుశీల్ చంద్ర భేటీ కానున్నారు. ఎన్నికలు జరిపితే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 28-30 తేదీల్లో ఎన్నికల సంఘం యూపీలో పర్యటించనుంది. పర్యటనకు ముందు ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అవుతున్నారు. కోవిడ్ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. అయితే ఎన్నికల నిర్వహణపై అలహాబాద్ హైకోర్టు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఫిబ్రవరి-మార్చిలో జరిగే ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టు ఆదేశించింది.. కోర్టు ఆదేశాలు, తాజా పరిస్థితిపై చర్చించనున్నారు.

మరిన్ని వార్తల కోసం..

దేశంలో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు

ఓటీటీ బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్.. నాగార్జునే హోస్ట్