బడ్జెట్ అప్‌‌డేట్స్: ఇకపై వెహికల్స్ లైఫ్ టైమ్ 20 ఏళ్లే

బడ్జెట్ అప్‌‌డేట్స్: ఇకపై వెహికల్స్ లైఫ్ టైమ్ 20 ఏళ్లే

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌‌ను సోమవారం లోక్‌‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌‌లో నూతన వాహన చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం వ్యక్తిగత వాహనాలను 20 సంవత్సరాలు, కమర్షియల్ వెహికల్స్‌‌ను 15 ఏళ్లు మాత్రమే వాడుకోవాలి. సదరు పీరియడ్ ముగిసిన తర్వాత ఆ బళ్లను స్క్రాప్‌‌కు ఇచ్చేయాలి. ఆ గడువు దాటిన వాహనాలను తుక్కు కింద మార్చే రూల్‌ను తీసుకొచ్చారు. పర్యావరణ క్షేమం, వాహనదాలు సేఫ్టీ రీత్యా కేంద్రం ఈ రూల్‌‌ను తీసుకొచ్చింది. అలాగే కాలుష్య నివారణకు రూ.2,217 కోట్లు కేటాయించారు.