న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు (ఖర్చులు మైనస్ ఆదాయం) విలువ గత నెల నాటికి రూ.12.52 లక్షల కోట్లకు చేరింది. ఇది 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లక్ష్యంలో 80.4 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో లోటు 85.8 శాతంగా నమోదైంది.
ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతం లేదా రూ.15.58 లక్షల కోట్లుగా అంచనా వేసింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం కేంద్రం మొత్తం ఆదాయం రూ.27.91 లక్షల కోట్లు. ఇందులో పన్ను ఆదాయం రూ.21.45 లక్షల కోట్లు, పన్నుయేతర ఆదాయం రూ.5.8 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం వ్యయం రూ.40.44 లక్షల కోట్లకు చేరింది.
