ఈడీ డైరెక్టర్​ను అక్టోబర్ దాకా కొనసాగించనివ్వండి

ఈడీ డైరెక్టర్​ను అక్టోబర్ దాకా  కొనసాగించనివ్వండి

న్యూఢిల్లీ: ఎన్​ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్  సంజయ్  కుమార్  మిశ్రాను అక్టోబర్  15 వరకు కొనసాగించనివ్వాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఫైనాన్షియల్  యాక్షన్  టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) రివ్యూ భేటీలో ఆయన పాల్గొనాల్సిన అవసరం ఉందని, ఆయన హాజరుకాకపోతే దేశ జాతీయ ప్రయోజనాలపై ప్రభావం పడుతుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు జస్టిస్  బీఆర్  గవాయ్, జస్టిస్  హిమ కోహ్లీ, జస్టిస్  ప్రశాంత్  కుమార్  మిశ్రాతో కూడిన బెంచ్ కు కేంద్రం తరపున సొలిసిటర్  జనరల్  తుషార్  మెహతా విజ్ఞప్తి చేశారు. 

‘‘మిశ్రా కొనసాగింపు విషయాన్ని త్వరగా తేల్చాల్సిన అవసరం ఉంది. ఆయన పొడిగింపుపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 28 లోపు విచారణ జరపాలి” అని మెహతా పేర్కొన్నారు. బెంచ్  స్పందిస్తూ.. ఈ విషయంపై ఒక బెంచ్​ను ఏర్పాటు చేసేందుకు సీజేఐకి రిజిస్ట్రీ విజ్ఞప్తి చేయాలని తెలిపింది. దీంతో విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. కాగా, ఈడీ డైరెక్టర్  సంజయ్  కుమార్  మిశ్రా పదవిని అదేపనిగా పొడిగించడం చట్టవిరుద్ధమంటూ 
సుప్రీంకోర్టు ఈ నెల 11న పేర్కొంది.