స్మార్ట్ పోలీస్ విధానం కోసం కేంద్రం కృషి

స్మార్ట్ పోలీస్ విధానం కోసం కేంద్రం కృషి

హైదరాబాద్ లో మంచి పోలీసు వ్యవస్థ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ ‌రెడ్డి. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ తో పాటు అంబర్ పేట్ నియోజకవర్గంలో 2 కోట్ల 45 లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడి ఆయన.. రాష్ట్ర పోలీసుల పనితీరు బాగుందన్నారు. గతంలో నేరాలను రుజువు చేయాలంటే కష్టమయ్యేదని…ప్రస్తుతం ఉన్న సాంకేతికత ద్వారా నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో రాష్ట్ర పోలీసులు ముందున్నారన్నారు. దేశంలో హైదరాబాద్ ‌తో సహా అన్ని నగరాల్లో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని తెలిపారు.

స్మార్ట్ పోలీస్ విధానం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మన దేశంలో ప్రపంచంలోనే తొలి ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబుల్లో 41 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలోనే భర్తీలు పూర్తిచేస్తామని ఆయన ప్రకటించారు. పారా మిలటరీలో ఉద్యోగాలు పొందేందుకు త్వరలో జాతీయ రక్షణ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు.