కరోనా రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించకపోతే మళ్లీ ఆంక్షలు పెడ్తం

కరోనా రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించకపోతే మళ్లీ ఆంక్షలు పెడ్తం

మళ్లీ ఆంక్షలు పెడ్తంన్యూఢిల్లీ: ప్రజలు కరోనా రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించకుండా హిల్‌‌‌‌‌‌‌‌ స్టేషన్లు, మార్కెట్లలో విపరీతంగా తిరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌‌‌‌‌‌‌‌ అయింది. ఫిజికల్‌‌‌‌‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌‌‌‌‌ పాటించకపోతే, మాస్క్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోకపోతే మళ్లీ ఆంక్షలు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది.  కొన్నిరోజులుగా వేలాది మంది టూరిస్టులు హిల్‌‌‌‌‌‌‌‌ స్టేషన్స్‌‌‌‌‌‌‌‌కు క్యూ కడుతున్నారు. హిమాచల్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రం గత నెల రెండో వారం తర్వాత కరోనా ఆంక్షలను సడలించడంతో ఎక్కువ మంది మనాలి, షిమ్లా, ధర్మశాలకు వెళ్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో జనం, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ బాగా పెరిగింది. ప్రజలు గుమికూడిన ఫొటోలు సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరలయ్యాయి. దీనిపై మంగళవారం హెల్త్‌‌‌‌‌‌‌‌ మినిస్ట్రీతో జరిగిన సమావేశంలో ఐసీఎంఆర్‌‌‌‌‌‌‌‌ డీజీ బలరామ్‌‌‌‌‌‌‌‌ భార్గవ మాట్లాడారు. ‘హిల్​ స్టేషన్లలో జనం వేలాదిగా గుమికూడిన ఫొటోలు చూస్తుంటే భయమేస్తోంది’ అన్నారు.