కరోనా మృతుల అంత్యక్రియలపై కేంద్రం గైడ్​లైన్స్

కరోనా మృతుల అంత్యక్రియలపై కేంద్రం గైడ్​లైన్స్

హైదరాబాద్, వెలుగుకరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎలా చేయాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్​లైన్స్​ రిలీజ్ చేసింది. డెడ్​బాడీలను శ్మశానాలకు తరలించడం, అంత్యక్రియలు చేయడం ఇలా అన్ని ప్రక్రియల్లోనూ ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది స్పష్టం చేసింది. డెడ్​బాడీల నుంచి వైరస్​ ఇతరులకు సోకుండా ఉండేందుకు ఈ గైడ్​లైన్స్​ను కచ్చితంగా అమలు చేయాలని సెంట్రల్​ హెల్త్ డిపార్ట్​మెంట్​అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

  • డెడ్​బాడీలను తరలించేటప్పుడు హెల్త్​ వర్కర్లకు ఇన్‌‌ఫెక్షన్‌‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డెడ్​బాడీని పరిశీలించేటప్పుడు హెల్త్ స్టాఫ్​ తడి అంటుకోకుండా చూసుకోవాలి. యాప్రాన్‌‌, గ్లోవ్స్‌‌, మాస్క్‌‌లు కచ్చితంగా వాడాలి.
  • కరోనా పేషెంట్​చికిత్స కోసం ఏర్పాటు చేసిన ట్యూబులు, డ్రైన్లు వంటి అన్ని హెల్త్​ టూల్స్​ను తీసేయాలి.
  • డెడ్​బాడీ నుంచి ఎలాంటి ద్రవాలు రాకుండా.. నోరు, ముక్కు రంధ్రాలను మూసేయాలి. డెడ్​బాడీని లీక్‌‌-ప్రూఫ్‌‌ ప్లాస్టిక్‌‌ బ్యాగ్‌‌లో పెట్టాలి. ఆ బ్యాగుపై హైపోక్లోరైట్‌‌ స్ప్రే చేయాలి. రోగి కోసం వాడిన వస్త్రాలన్నింటినీ బయోహజార్డ్‌‌ బ్యాగ్‌‌లో ఉంచాలి.
  • వ్యక్తి చనిపోయిన రూంలో ఫ్లోర్​, మంచం, టేబుల్​ సహా అన్నింటిపైనా సోడియం హైపోక్లోరైట్ స్ర్పే చేయాలి.
  • డెడ్​బాడీలను 4 డిగ్రీల సెల్సియస్‌‌ కోల్డ్‌‌ చాంబర్స్‌‌లో పెట్టాలి. డెడ్​బాడీ ఉన్న ప్రాంతాన్ని సోడియం హైపోక్లోరైట్ తో ఎప్పటికప్పుడు శుభ్రం​ చేయాలి.
  • డెడ్​బాడీని గదిలో నుంచి బయటికి తీసుకువచ్చేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైనా చూడాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  • డెడ్​బాడీని తరలించేటప్పుడు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తరచుగా సోడియం హైపోక్లోరైట్ తో క్లీన్​ చేయాలి.
  • ఐసోలేషన్​ రూంలు, మార్చురీ, అంబులెన్స్‌‌, శ్మశానవాటికల్లో డెడ్​బాడీలను ఎత్తేటప్పుడు, దించేటప్పుడు సిబ్బందికి ఇన్‌‌ఫెక్షన్‌‌ రాకుండా ఏం చేయాలనే దానిపై ముందుగానే ట్రైనింగ్​ ఇవ్వాలి.
  • డెడ్​బాడీకి వెంటనే అంత్యక్రియలు పూర్తి చేయాలి. – సాధ్యమైనంత వరకూ శవపరీక్ష లేకుండా చూడాలి. తప్పనిసరైతే డాక్టర్లు తగుజాగ్రత్తలు పాటించాలి.
  • పోస్టుమార్టం అవసరమైతే ఆ రూంలోకి వీలైనంత తక్కువ మంది ఫోరెన్సిక్, ఇతర స్టాఫ్​ను అనుమతించాలి. ఫోరెన్సిక్‌‌ నిపుణులు, సపోర్టింగ్​ స్టాఫ్ కచ్చితంగా పీపీఈ కోట్​లు, ఎన్‌‌95 మాస్క్‌‌లు, కళ్లద్దాలు వేసుకోవాలి.
  • పోస్టుమార్టం చేసేటప్పుడు రౌండ్‌‌ ఎండెడ్  కత్తెరలనే వాడాలి. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే డెడ్ బాడీని సోడియం హైపోక్లోరైట్‌‌తో శుభ్రంచేసి  లీక్‌‌-ప్రూఫ్‌‌ ప్లాస్టిక్‌‌ బ్యాగ్‌‌లో పెట్టాలి.
  • ఎలాంటి అంతిమయాత్ర లేకుండా నేరుగా శ్మశానవాటికకు డెడ్​బాడీని తీసుకుపోవాలి. ఎక్కువ మంది గుమికూడవద్దు. సమీప కుటుంబ సభ్యులు కొందరు వచ్చినా కచ్చితంగా సోషల్​ డిస్టెన్స్​​ పాటించేలా చూడాలి.
  • అంత్యక్రియల సమయంలో డెడ్​ బాడీ ఉన్న బ్యాగ్‌‌ను తెరిచి దూరం నుంచి బంధువులు, స్నేహితులు ఆఖరిసారి చూడడానికి అనుమతించొచ్చు.
  • డెడ్​బాడీని ముట్టుకోకుండా మతపరమైన అంత్యక్రియలన్నీ కొనసాగించవచ్చు. వీలైనంత దూరంగా ఉండి ఇవన్నీ చేసుకోవాలి.
  • మృతదేహానికి స్నానం చేయించడం, తాకడం, ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం లాంటివి చేయకూడదు.
  • అంత్యక్రియల తర్వాత చితాభస్మం నుంచి ఎలాంటి ఇన్‌‌ఫెక్షన్లు రావు. దీన్ని బంధువులు తీసుకోవచ్చు.

తొమ్మిది దేశాల్లో నో కరోనా