
సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు మూడూ కూడా.. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేవేనన్నారు రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హారీష్ రావు. జిల్లాలోని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ యార్డులో.. మార్కెట్ కమిటీ ఛైర్మన్ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ తో కలిసి మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అన్నం పెట్టే రైతులను ఆదుకునే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని, దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు.
రైతులను ముంచటానికే కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చిందని విమర్శించారు. రేపటి భారత్ బంద్ ను విజయవంతం చేయాలంటూ టీఆర్ఎస్ శ్రేణులకు, రైతులకు పిలుపునిచ్చారు.