ఆపరేషన్ సింధూర్.. మే 8న ఉదయం 11 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్

ఆపరేషన్ సింధూర్.. మే 8న ఉదయం 11 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్

ఆపరేషన్ సింధూర్ వేళ మే 8న ఆల్ పార్టీ మీటింగ్  ఏర్పాటు చేసింది కేంద్రం.  8న  ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసిందని  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తన ఎక్స్ లో   పోస్ట్  చేశారు.  రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన  ఆపరేషన్ సింధూర్ పై ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించనున్నారు.  పాకిస్తాన్ మళ్లీ దాడి చేస్తే ఏం చేద్దామనేదానిపై ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించనున్నారు.

మరో వైపు కాసేపట్లో మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సీఎస్ లు,డీజీపీలో ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

కాసేపటి క్రితమే ఆపరేషన్ సిందూర్ పై కేంద్ర కేబినెట్ కమిటీ భేటీ అయింది. కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను భేటీలో చర్చించారు.  పాకిస్తాన్ బదులుగా  సరిహద్దులో దాడులు చేస్తే ఎలా ముందుకెళ్లాలి..ఎలా స్పందించాలనే దానిపై కేబినెట్ భేటీలో చర్చించారు.  

Also Read : నీకు యుద్ధం చేసే సీన్ లేదు.. మూసుకుని కూర్చో

మే 6న అర్థరాత్రి 1.05 గంటల నుంచి 1.05 గంటల వరకు 25 నిమిషాల పాటు  పాకిస్తాన్,  పీవోకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మిసైళ్లతో దాడులు చేసిన సంగతి తెలిసిందే.. ఈ దాడుల్లో జైషే మొహమ్మద్ (జెఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఇటి), హిజ్బుల్ ముజాహిదీన్‌లతో సంబంధం ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదులుఈ దాడుల్లో మరణించారని ఉన్నత వర్గాలు తెలిపాయి.