
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. పహల్గాంలో దాడికి ప్రతీకారంగా.. పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ పై ఇండియా సైనిక దాడికి దిగింది. పాకిస్తాన్ కేంద్రంగా.. పాకిస్తాన్ సాయంతో.. పాక్ నిధులతో నడుస్తున్న 9 ఉగ్రస్థావరాలను ఇండియా ధ్వంసం చేసింది. 25 నిమిషాలు భారత యుద్ధ విమానాలు మిస్సైల్స్, బాంబులతో.. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసింది.
ఈ క్రమంలోనే పాకిస్తాన్ స్పందించింది. భారత్ చేసింది యుద్ధ చర్య అంటూ గగ్గోలు పెడుతుంది. భారత్ పై ప్రతీకారం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. సరైన సమయంలో సమాధానం ఇస్తామంటూ పాక్ ప్రగల్భాలు పలుకుతున్నది. ఈ క్రమంలోనే భారత్ ఆపరేషన్ సింధూర్ పై అమెరికా స్పందించింది. సైనిక చర్యను త్వరగా ముగించాలని భారత్ కు సూచిస్తూనే.. పాకిస్తాన్ కు గడ్డి పెట్టింది. యుద్ధానికి దిగొద్దు అంటూ పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది అమెరికా. నీకు అంత సీన్ లేదు.. మూసుకుని కూర్చో అంటూ పాకిస్తాన్ దేశానికి అమెరికా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఉగ్రవాదంపై ఇండియా చేస్తున్న దాడి అంటూ పాకిస్తాన్ కు చెబుతూనే.. యుద్ధం చేసే సత్తా మీ దేశానికి లేదని.. యుద్ధం అంటూ పెద్ద పెద్ద మాటలు అన్నీ కట్టిపెట్టు అంటూ కొరఢాతో కొట్టినట్లు పాకిస్తాన్ దేశానికి ట్రంప్ స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీనికి ముందు అజిత్ దోబల్ కూడా అమెరికా కీలక ప్రతినిధులకు దాడి గురించిన పూర్తి సమాచారాన్ని పంచుకున్న సంగతి తెలిసిందే.
Also Read : ఆపరేషన్ సింధూర్ పూర్తి డీటెల్స్
అన్ని చూస్తూ ఉండు.. యుద్ధం ఆలోచన చేయకు.. యుద్ధం చేసే స్థాయి.. సత్తా.. దమ్ము లేదు అంటూ పాకిస్తాన్ దేశానికి అమెరికా గట్టిగానే చెప్పుకొచ్చింది. ఇండియాతో యుద్ధం చేస్తే పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చేది లేదని కూడా ఖరాఖండిగా తేల్చి చెప్పింది అమెరికా. దీంతో పాకిస్తాన్ అన్నీ మూసుకుని.. తన గోడును ప్రపంచ దేశాలకు చెప్పుకుంటుంది. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ దేశాన్ని మిగతా దేశాలు కూడా నమ్మటం లేదు.. భారత్ ఆపరేషన్ సింధూర్ కు పూర్తి మద్దతు ఇస్తూనే.. పాక్ ఉగ్రచర్యలను తప్పుబడుతున్నాయి. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరి అయ్యింది.