జమ్మూకాశ్మీర్‌‌‌‌కు కేంద్ర గ్రాంట్స్

జమ్మూకాశ్మీర్‌‌‌‌కు కేంద్ర గ్రాంట్స్

న్యూఢిల్లీ: యూనియన్ టెరిటరీ జమ్మూకాశ్మీర్‌‌‌‌కు కేంద్ర సహాయం, గ్రాంట్లు, లోన్లలో భాగంగా రూ.35,581.44 కోట్లు కేటాయించారు. ఆర్టికల్‌‌ 370 రద్దుతో కాశ్మీర్‌‌‌‌ను జమ్మూకాశ్మీర్‌‌‌‌, లడఖ్‌‌ అనే రెండు యూటీలుగా డివైడ్ చేశారు. పోయిన బడ్జెట్‌‌లో రూ.34,704.46 కోట్లు కేటాయించగా.. ఈసారి దానిని కొద్దిగా పెంచారు. వీటిలో రూ.33,923 కోట్లు కేంద్ర సహాయంగా ఉంది. అయితే లడఖ్‌‌కు ఈసారి కూడా రూ.5,958 కోట్లు ఇచ్చారు. ఇక, దాల్‌‌ నగీన్‌‌ లేక్‌‌ పునరుద్దరణకు గ్రాంట్‌‌గా రూ.273 కోట్లు, యూటీ డిజాస్టర్‌‌‌‌ రెస్పాన్స్ ఫండ్‌‌కు గ్రాంట్స్‌‌గా రూ.279 కోట్లు కేటాయించారు.

కేంద్రపాలిత ప్రాంతాలకు మూలధన వ్యయానికి సపోర్ట్‌‌గా బడ్జెట్‌‌లో రూ.500 కోట్లు, రాట్లే 800 మెగావాట్ల హైడ్రోఎలక్ట్రిక్‌‌ ప్రాజెక్టుకు ఈక్విటీ గ్రాంట్‌‌గా రూ.476.44 కోట్లు, 624 మెగావాట్ల కిరు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఈక్విటీ గ్రాంట్‌‌కు రూ.130 కోట్లు ఇచ్చింది. అండమాన్ నికోబార్‌‌‌‌ దీవులకు రూ.5,703.64 కోట్లు, లక్షద్వీప్‌‌కు రూ.1,394.75 కోట్లు, చండీఘడ్‌‌కు రూ.4,846.79 కోట్లు, దాద్రా అండ్‌‌ నగర్ హవేలీకి రూ.1,374.10 కోట్లు, ఢిల్లీకి రూ.1,168 కోట్లు, పుదుచ్చేరికి రూ.1,729.79 కోట్లు ఇస్తున్నట్టు బడ్జెట్‌‌లో చూపించారు.