బీఈ/బీటెక్ అర్హతతో హైదరాబాద్ CITDలో ఉద్యోగాలు.. ఏప్రిల్ 6న ఇంటర్వ్యూలు!

బీఈ/బీటెక్ అర్హతతో హైదరాబాద్ CITDలో ఉద్యోగాలు.. ఏప్రిల్ 6న ఇంటర్వ్యూలు!

సెంట్రల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, హైదరాబాద్ (సీఐటీడీ, హైదరాబాద్) ట్రైనింగ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: ట్రైనింగ్ ఆఫీసర్. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్  ఇంజినీరింగ్​లో బీఈ/ బి.టెక్ లేదా ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మార్చి 28.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: ఏప్రిల్ 6.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.citdindia.inను సందర్శించండి.