
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనాప్యాకేజీపై సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు సరిగాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మాట్లాడే భాష ఉపయోగించే శక్తి మాకు లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని కించపరుస్తూ కేసీఆర్ మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ భాషను ఎవరూ సమర్థించరని ఆయన అన్నారు. లాక్డౌన్ దృష్ట్యా కేంద్రం పెట్టిన నిబంధనల్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. లాక్డౌన్ గురించి ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. ఇప్పటికి కూడా ప్రధాని మోడీ.. 25 దేశాల ప్రతినిధులతో ప్రతిరోజూ చర్చిస్తున్నారని ఆయన అన్నారు. కరోనా వల్ల ఏ దేశం కూడా భారత్ ను ఆదుకునే స్థితిలో లేదని ఆయన అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో తెలంగాణకు మేలు జరిగిందా? లేదా? అనేది కేసీఆర్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. FRBM పరిమితిని కేంద్రం 5 శాతానికి పెంచినట్లు ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని ఆయన అన్నారు. సంస్కరణలు తీసుకురాకపోతే దేశం ముందుకెళ్లదని ఆయన అన్నారు. డివల్యూషన్ ఫండ్స్ ను 9 శాతానికి పెంచినట్లు ఆయన అన్నారు. నాబార్డు ద్వారా రాష్ట్రానికి అదనపు నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.
For More News..