జూన్-30 వ‌ర‌కు లాక్ డౌన్ కు కేంద్రం అనుమ‌తి

జూన్-30 వ‌ర‌కు లాక్ డౌన్ కు కేంద్రం అనుమ‌తి

హైద‌రాబాద్: జూన్ 30 వరకు లాక్ డౌన్ పెట్టుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. లాక్ డౌన్ పొడిగించుకోవాలా లేదా అనేది ఆయా రాష్ట్రాల ఇష్టమ‌ని కేంద్రం క్లారిటీ ఇచ్చింద‌ని తెలిపారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజల ముక్కుపిండి డ‌బ్బులు వసూలు చేస్తున్నాయని బాధ‌ప‌డ్డారు. ప్ర‌జ‌లు ఆస్తులు అమ్మి బిల్లులు చెల్లిస్తున్నారని.. అయినా కానీ.. రోగి ప్రాణంతో బతికి వస్తాడా అనేది అనుమానంగా ఉంద‌న్నారు. హాస్పిటల్స్ ముందు వివరాలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నానని..ఆనందయ్య మందుపై కేంద్రానికి విజ్ఞప్తిలు వచ్చాయన్నారు. రాష్ట్రం పరిశోధించి కేంద్ర ఆయుష్ డిపార్ట్ మెంట్ కి పంపిస్తే.. దాన్ని సప్లిమెంట్ మెడిసిన్ గా వాడే అవకాశం ఉందన్నారు.

కాక్ టైల్ మందుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని..తెలంగాణకి కోటి వ్యాక్సిన్ డోస్ లే కాదు ఇంకా కావాలన్నారు. సెప్టెంబర్ వరకు వ్యాక్సిన్ ఉత్పత్తి పెరుగుతోందని...దీంతో కొరత తగ్గుతుందన్నారు. 4 లక్షల 90 వేల డోస్ లు ఇప్పటి వరకు తెలంగాణ కొనుగోలు చేసిందని..ఆంద్ర 16 లక్షల డోస్ లు కొనుగోలు చేసిందని చెప్పారు. కేజ్రీవాల్ విచిత్ర మైన సీఎం అని..రాష్ట్రాల గురించి కాదు, విదేశాల గురించి కూడా మాట్లాడుతారన్నారు. సింగపూర్ పై ఆయన చేసిన కామెంట్స్ ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే అన్నారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి.