కేసీఆర్ రావొద్దని ఎలాంటి సందేశం పంపలేదు 

కేసీఆర్ రావొద్దని ఎలాంటి సందేశం పంపలేదు 

ప్రధాని టూర్లో సీఎం కేసీఆర్ ఉండాల్సిన అవసరంలేదని పీఎంఓ నుంచి సమాచారం వచ్చిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఖండించారు. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి సందేశం పంపలేదని ట్వీట్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. 

ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనపై మంత్రి కేటీఆర్ తాజాగా నేషనల్ మీడియాలో స్పందించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం వచ్చినందునే కేసీఆర్ ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన డీఓపీటీ మినిస్టర్ డా.జితేందర్ సింగ్..  కేటీఆర్  మీడియాతో చెప్పిన మాటల్లో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. వాస్తవానికి ప్రధాని టూర్ టైంలో కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం పంపిందని స్పష్టం చేశారు. ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే కేసీఆర్ రాలేకపోయారని ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రి స్పష్టతనిచ్చారు.