బీఈ/ బిటెక్ అర్హతతో CSBలో సైంటిస్ట్–బి పోస్టులు.. మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..

 బీఈ/ బిటెక్ అర్హతతో CSBలో సైంటిస్ట్–బి పోస్టులు.. మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..

భారత ప్రభుత్వ టెక్స్​టైల్స్ మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ (సీఎస్​బీ) సైంటిస్ట్–-బి (పోస్ట్-కోకూన్ సెక్టార్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 18.

ఖాళీలు: 28 (సైంటిస్ట్–బి పోస్ట్ కోకూన్ సెక్టార్). 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి టెక్స్​టైల్ టెక్నాలజీ / టెక్స్​టైల్ ఇంజినీరింగ్ & ఫైబర్ సైన్స్​లో బీఈ/ బి.టెక్.లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో చెల్లుబాటు అయ్యే గేట్– 2025 స్కోరు తప్పనిసరి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 19.

అప్లికేషన్ ఫీజు:  జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు 
ఇచ్చారు.

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 18.

సెలెక్షన్ ప్రాసెస్: గేట్–2025 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్ చేశారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత తుది మెరిట్ ప్రకటిస్తారు. 

పూర్తి వివరాలకు csb.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి.