హరిత విప్లవ పితామహుడికి భారతరత్న

హరిత విప్లవ పితామహుడికి భారతరత్న

వ్యవసాయ శాస్త్రవేత్త,  హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాతన్ కు దేశ అత్యున్నత అవార్డు భారతరత్నను ప్రకటించింది కేంద్రం ప్రభుత్వం. ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం స్వామినాథన్ తోపాటు మాజీ ప్రధానమంత్రులు పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్ లకు కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించింది.
అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టించడంతోపాటు వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారాయ. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. 

స్వామినాథన్.. 1925 ఆగష్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో  మంకొంబు సాంబశివన్, పార్వతి దంపతులకు జన్మించారు. 1944లో  కేరళ త్రివేండ్రంలోని మహారాజా కళాశాలలో ఆయన జంతుశాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు.  తర్వాత మద్రాస్ వ్యవసాయ కళాశాలలో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు.
1955లో ఎం.ఎస్. స్వామినాథన్ వివాహం మీనా స్వామినాథన్ తో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో డా.సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు డిప్యూటీ డైరక్టరు జనరల్ గానూ, రెండవ కుమార్తె డా. మధుర స్వామినాథన్ బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ఆర్థిక శాస్త్రంలో అధ్యాపకురాలిగానూ, మూడవ కుమార్తె నిత్యా స్వామినాథన్ ఉత్తర అంగోలియా విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ జనరల్ డైరక్టర్‌గా స్వామినాథన్ కు బాధ్యతలు నిర్వర్తించారు. 1979 నుంచి 1980 వరకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరక్టర్ జనరల్‌గా పని చేశారు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా పనిచేశారు.

వ్యవసాయ రంగంలో స్వామినాథన్‌ చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ కు దేశ అత్యుత్తమ పురస్కారాలతో సత్కరించింది. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్‌ పురస్కారాలను అందుకున్న స్వామినాథన్..  1971లో రామన్‌ మెగసెసే అవార్డు,1989లో  పద్మవిభూషణ్‌ అవార్డును అందుకున్నారు.  1987లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ అవార్డుతోపాటు1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2013లో ఇందిరాగాంధీ సమైక్యత పురస్కారాన్ని స్వామినాథన్ అందుకున్నారు.