
ఇప్పుడంతా శుభ్మన్ గిల్ ఎరా నడుస్తోంది. వన్డే, టెస్టు కెప్టెన్సీ బాధ్యాతలు చేపట్టాక ఇండియాకు ఒక ధోనీ, ఒక రోహిత్ తరహాలో.. మరో లాంగ్ స్టాండింగ్ కెప్టెన్ దొరికాడని ఇప్పటికే క్రికెట్ కమ్యూనిటీలో చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి గిల్ గుకు బాధ్యతలు అప్పగించడం వెనుక.. టీమిండియా సారథ్యం బాధ్యతలు పూర్తిగా గిల్ చేతికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సాటి క్రికెటర్లు గిల్ ను చూసి అభద్రతాభావానికి గురవుతున్నారేమో అనుకునేలా సూర్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి.
అవును.. సూర్య కుమార్ సరదాగా అన్నాడో లేక మనసులో మాట బయటపెట్టాడో కానీ.. ఈ టీ20 కెప్టెన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే వన్డే, టెస్టు కెప్టెన్సీ పగ్గాలు గిల్ చేతికి వెళ్లాయి. టీ20 కెప్టెన్సీ కూడా నా నుంచి లాగేసుకుంటాడేమో అనే భయం నాలో మొదలైంది.. అంటూ సూర్య అనటం షాకింగ్ కు గురిచేసింది.
►ALSO READ | ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి.. రషీద్ ఖాన్ PSL ను బాయ్కాట్ చేస్తున్నాడా..?
నేను అబాద్ధం చెప్పడం లేదు. ప్రతి ఒక్కరిలో భయం ఉంటుంది. నాలో కూడా ఆ ఫియర్ ఉన్న మాట నిజం. అయితే ఆ ఫియర్ నన్ను మరింత మోటివేట్ చేసేలా ఉంది కానీ.. ఈర్శ్య పడే ఫియర్ కాదని అన్నాడు. గిల్ రెండు ఫార్మాట్లకు కెప్టెన్ కావడం సంతోషంగా ఉంది. మా ఇద్దరి మధ్య ఫీల్డ్ లో మంచి సాంగత్యం ఉంటుంది. గిల్ ఎదుగుదల నన్ను మోటివేట్ చేస్తుంది.. అంటూ చెప్పుకొచ్చాడు సూర్య.
ఇలాంటి పరిస్థితులకు కామన్.. నేను ఫస్ట్ మ్యాచ్ ఏం ఆడట్లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. మరింత హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నిస్తా. జట్టు కోసం కష్టపడటం.. అందుకోసం సిన్సియర్ గా పనిచేసుకుంటూ వెళ్లడమే నా పని.. అంటూ తన మనసులోని మాట బయటపెట్టాడు.