పండుగ పూట ఫ్లైట్ రద్దు.. ఇటిలీ ఎయిర్పోర్ట్లో వందల మంది ఇండియన్స్ పడిగాపులు

పండుగ పూట ఫ్లైట్ రద్దు.. ఇటిలీ ఎయిర్పోర్ట్లో వందల మంది ఇండియన్స్ పడిగాపులు

దీపావళి పండుగ ఎంత ఉల్లాసంగా జరుపుకుంటారో చెప్పాల్సిన పనిలేదు. టపాసులు పేలుస్తూ దీపాల వెలుగులో కుటుంబ సభ్యులతో గడిపే ఆ క్షణాలు ఎంతో కోలాహలంగా ఉంటాయి. ఏ దేశంలో ఉన్నా ఇక్కడి ఆనంద క్షణాలు సొంతగడ్డకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేలా ప్రేరేపిస్తుంటాయి. అలా పండుగను కుటంబంతో చేసుకోవాలనుకున్న వాళ్లు ఇండియాకు ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పటికీ.. ఓయిర్ పోర్ట్ లోనే ఉండాల్సిన పరిస్థితి. ఎయిర్ ఇండియా విమానం టెక్నికల్ సమస్యలతో క్యాన్సిల్ కావడంతో ఇటలీలోనే పడిగాపులు కాస్తున్నారు భారతీయులు. 

శుక్రవారం (ఇండియాలో శనివారం అక్టోబర్ 18) ఎయిర్ ఇండియా ఫ్లైట్ రద్దు కావడంతో విమానాశ్రయంలోనే ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మిలాన్ నుంచి ఢిల్లీ రావాల్సిన AI138 విమానం టెక్నికల్ ఇష్యూ కారణంగా రద్దయింది. 

టెక్నికల్ కారణంగా ఫ్లైట్ రద్దయిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికుల సేఫ్టీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు అక్టోబర్ 20 న ఉన్న ఇతర ఎయిర్ ఇండియా లేదా ఇతర  ఫ్లైట్లను రీబుక్ చేసుకున్నట్లు తెలిపారు. 

షెన్ జెన్ నుంచి వస్తున్న ఒక ప్యాసెంజర్ వీసా సోమవారం (అక్టోబర్ 20) ఎక్స్ పైరీ అవుతున్నందున.. ఆదివారం ఫ్లైట్ ను రీ బుక్ చేసుకున్నట్లు ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ చెప్పారు.

ఇబ్బందులకు చింతిస్తున్నట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా.. ప్రయాణికులకు కావాల్సిన ఆహారం, వసతి తదితర సౌకర్యాలకు ఎలాంటి లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.