
సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని అందోల్ గ్రామ శివారులో ఉన్న ఫైర్ వర్క్స్ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ( అక్టోబర్ 18 ) జరిగిన ఈ ప్రమాదంలో ఫైర్ వర్క్స్ గోడౌన్ పూర్తిగా కాలి ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో లక్షల్లో ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డారు స్థానికులు. గోడౌన్ పరిసరాలలో దట్టమైన పొగ కమ్మేసింది. దీపావళి వేళ ప్రమాదం జరగడంతో యజమాని కుటుంబంలో విషాదం నెలకొంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లోని పాతబస్తీలోని ఓ స్వీట్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ( అక్టోబర్ 17 ) జరిగిన ఈ ప్రమాదంలో లక్షల్లో నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
►ALSO READ | వైన్స్ షాపులకు 60 వేల దరఖాస్తులు.. ఒక్కో షాపునకు సగటున 23 దరఖాస్తులు.. 23న లక్కీ డిప్
పాతబస్తీ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోక్ క్లాక్ టవర్ సమీపంలో ఉన్న ఓ ఆప్టికల్ అండ్ స్వీట్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో షాపులోని లక్షలు విలువజేసే వస్తువులు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.