తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్ 6న సాయంత్రం ఏరియల్ వ్యూ ద్వారా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8,9 వ తేదీల్లో రైజింగ్ గ్లోబల్ సమిట్ జరగనుంది. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో పెంచడమే లక్ష్యంగా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
డిసెంబర్ 8 మధ్యాహ్నం ఒంటి గంటకు గ్లోబల్ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించనున్నారు. తొలి రోజు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. మొత్తం 27 సెషన్లు ఉంటాయి. డిసెంబర్ 8న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు ప్రసంగాలు ఉంటాయి. మధ్యాహ్నం 2.30గంటలకు రేవంత్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి పలు రంగాలపై చర్చ జరుగుతుంది. 3 గంటల నుంచి 4 గంటల వరకు విద్యుత్ రంగంపై చర్చ ఉంటుంది. సెమీకండక్టర్లు, గ్రీన్ ఎర్జీ , ఎరోస్పేస్ ఎడ్యుకేషన్ పై చర్చ జరుగుతుంది. సాయంత్రం 6గంటలకు సమ్మిట్ ముగుస్తుంది. డిసెంబర్ 9వ తేదీ ఉదయం 10 గంటలకు సమ్మిట్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
