కోల్బెల్ట్: రిటైర్డు బొగ్గు గనుల ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ.10వేలు ఇవ్వాలని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోకు ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మినగర్ లో సింగరేణి రిటైర్డు ఉద్యోగులు పాలాభిషేకం నిర్వహించారు.
సింగరేణి సంస్థలో మూడు నుంచి నాలుగు దశాబ్దాల పాటు డ్యూటీలు చేసి సంస్థ అభివృద్ధి కోసం పాటుపడిన రిటైర్డు ఉద్యోగుల కు కనీస పెన్షన్ రూ.10వేలు ఇవ్వాలని ఎంపీ వంశీకృష్ణ కేంద్రాన్ని డిమాండ్ చేయడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సింగరేణి రిటైర్డు ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గజ్జెలి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్ల బండి రాజన్న,ప్రధాన కార్యదర్శి పూదరి నర య్య తదితరులు పాల్గొన్నారు.
