అయోధ్య రామమందిరం పూర్తి చేశాం..మిగిలింది కాశీ, మధుర ఆలయాలే : సీఎం యోగి

అయోధ్య రామమందిరం పూర్తి చేశాం..మిగిలింది కాశీ, మధుర ఆలయాలే : సీఎం యోగి

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తి చేశాం.. మేం ప్రతి ప్రాంతంలో ఉంటా.. ఇక మా దృష్టి కాశీ విశ్వనాథ ఆలయం,  మధుర మీనాక్షి అలయ నిర్మాణమే అన్నారు.శనివారం న్యూఢిల్లీలో జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ 2025లో  సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. 

వారణాసి ( కాశి)లో జ్ణాన్ వాపి మసీదు, మధురలో షాహీ ఈద్గా మసీదు వివాదాస్పద నిర్మాణాలపై ప్రస్తావనకు వచ్చిన సందర్భంగా సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య తో బాస్ ఝాంకీ హై... కాశీ-మధుర అభి బాకీ హై అని నినాదాన్ని గుర్తు చేశారు. మేం అన్ని ప్రాంతాలను చేరుకుంటా.. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను  చేరగలిగామంటూ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఏ సమాజమైనా దాని వారసత్వాన్ని గర్వంగా భావించాలి.. ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించాం.. గౌరవ సుప్రీంకోర్టు ముందు వాస్తవాలను, ఆధారాలను పెట్టాం.. సమీక్షించని తర్వాత రామమందిర్ నిర్మాణానికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది.. ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అని సీఎం యోగి అన్నారు. 500 ఏళ్ల తర్వాత రామ జన్మభూమి ఆలయ నిర్మాణం నా కెరీర్‌లో ఒక ఐకానిక్ మూవ్ మెంట్ అన్నారు సీఎం యోగి.