న్యూఢిల్లీ: టీమిండియా యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దు చెలరేగిపోతున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ ఇలా ఆట ఏదైనా సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే టీ20 ఫార్మాట్లో అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డ్ సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ క్రికెటర్‌గా రేర్ ఫీట్ నెలకొల్పాడు.
సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా సర్వీసెస్‌తో జరిగిన మ్యాచులో 3 సిక్సర్లు బాదటం ద్వారా ఈ ఘనత సాధించాడు. గతంలోనూ ఈ రికార్డ్ అభిషేక్ పేరిటే ఉండటం విశేషం. 2024 క్యాలెండర్ ఇయర్లో 87 సిక్సర్లు బాదాడు ఈ పంజాబ్ బ్యాటర్. 2025 క్యాలెండర్ ఇయర్లో 100 సిక్సర్లు బాది తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు.
►ALSO READ | IND vs SA: వెళ్లి పని చూస్కో.. DRS అడిగితే కుల్దీప్‌ను రెండుసార్లు తిట్టి పంపించిన రోహిత్
అభిషేక్ ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో 47 సిక్సర్లు కొట్టాడు. మిగిలిన 53 సిక్సర్లు ఐపీఎల్, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కొట్టాడు. డిసెంబర్ 9న కటక్‌లో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో టీమిండియా తరుఫున అభిషేక్ బరిలోకి దిగనున్నాడు. దీంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.
ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక T20 సిక్సర్లు:
- ఆటగాడు సిక్స్‌ల సంఖ్య సంవత్సరం
- అభిషేక్ శర్మ 100* 2025
- అభిషేక్ శర్మ 87 - 2024
- సూర్యకుమార్ యాదవ్ 85 2022
- సూర్యకుమార్ యాదవ్ 71 2023
- రిషబ్ పంత్ 66 2018
