గుండె పోటు ప్రమాదాన్ని పెంచే 5 డేంజర్ అలవాట్లు :ఈ ఆహారాన్ని వెంటనే మానేయండి !

గుండె పోటు ప్రమాదాన్ని పెంచే 5 డేంజర్ అలవాట్లు :ఈ ఆహారాన్ని వెంటనే మానేయండి !

మనం రోజు తినే ఆహారం మన గుండె ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలా మంది తెలియకుండానే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే అలవాట్లను పాటిస్తున్నారు. చక్కెరలు, ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన పదార్థాలు... ఇవన్నీ గుండెను నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయి. గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అలవాట్ల గురించి డాక్టర్ డిమిత్రి యారనోవ్ కొన్ని ముఖ్య విషయాలు చెప్పారు . 

 మీ జీర్ణాశయంలోని బ్యాక్టీరియా (Gut Bacteria) గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని రహస్యంగా పెంచుతుందని మీకు తెలుసా..? కొన్ని సూక్ష్మజీవులు మనం తినే ఆహారాన్ని TMAO అనే పదార్థంగా మార్చగలవు. దీనికి గుండెపోటుకు గట్టి సంబంధం ఉంటుంది. ఆరోగ్యం లేని గట్ బ్యాక్టీరియా (అనారోగ్యకరమైన మైక్రోబయోమ్) వాపును పెంచుతుంది (Inflammation), రక్తపోటును పెంచుతుంది ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ తప్పిస్తుంది. ఇదంతా బయటికి లక్షణాలు కనిపించకుండానే జరుగుతుంది.

మీ గుండె ఆరోగ్యం మెరుగుపడాలంటే ఇవి పాటించండి:
ఎక్కువ ఫైబర్   తినండి: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ఇవి శరీరంలో వాపును తగ్గిస్తాయి.

ప్రాసెస్ చేసిన ఫుడ్  తగ్గించండి: అల్ట్రా-ప్రాసెస్ చేసిన స్నాక్స్, రెడీమేడ్ భోజనాలు... జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను పాడుచేసి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.

►ALSO READ | మీకో విషయం తెలుసా? చీమలు కూడా కారుణ్య మరణాలు కోరుకుంటాయట..ఎందుకంటే?

పులియబెట్టిన ఆహారాలు (Fermented Foods) : మీ ఆహారంలో పెరుగు, కేఫీర్, కిమ్చి వంటి వాటిని చేర్చుకోండి. వీటిలో ఉండే ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి.

మాంసం (Red Meat), గుడ్లు తగ్గించండి: ఈ ఆహారాలు TMAO స్థాయిలను పెంచుతాయి. ఈ TMAO అనేది రక్తనాళాలు అడ్డుపడటానికి (Artery Clogging) ఇంకా గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.

నీరు బాగా తాగండి: శరీరానికి  కావాల్సినంత నీరు తాగడం జీర్ణక్రియకు మంచిది. ఎక్కువ ఒత్తిడి ఉంటే గట్ ఆరోగ్యం దెబ్బతిని, గుండెకు హాని కలిగించే ప్రమాదం వస్తుంది.