వెల్ కమ్ టు న్యూ ఇయర్ అని సెలబ్రేట్ చేసుకున్న 2025 న్యూఇయర్ ఇప్పుడు పాత సంవత్సరం అయ్యింది. 2026 కొత్త ఏడాది కోసం అంతా సిద్ధమవుతున్నారు. అయితే 2025 ఇయర్ ను రివైండ్ చేసుకుంటోంది ప్రపంచం అంతా. అందులో భాగంగా 2025 టాప్ 10 గూగుల్ సర్చెస్ లిస్టులు రెడీ అయిపోయాయి. ఒక్కో కేటగిరీలో ఒక్కో లిస్టు రిలీజ్ అవుతోంది. మరి 2025లో భోజన ప్రియులు అత్యధికంగా వెతికన వంకటకాలు ఏంటో కూడా తెలుసుకుందామా..
ఇడ్లీ:
ఇండియాలో ఎక్కువ మంది గూగుల్ చేసిన రెసిపీ ఇడ్లీ అంట. సాఫ్ట్ ఫుడ్ అయిన ఇడ్లీ గురించి ఎందుకు అంతగా వెతికారు అనేగా మీ డౌట్.. ఎందుకంటే.. ఇండియాలో అత్యంత పాపులర్ అయిన ఇడ్లీ గురించి వెతికారట. ఇడ్లీ తయారు చేయడం, ఫెర్మంటేషన్, హోటల్ స్టైల్ చట్నీ చేయడం, మిల్లెట్ ఇడ్లీ.. ఇలా రకరకాలుగా వెతికారట. ఎందుకింత అంటే.. ఈ మధ్య జంక్ ఫుడ్ తగ్గించాలనే వాళ్లు కూడా పెరిపోవటమే ఇందుకు కారణం.
పోర్న్ స్టార్ మార్టినీ:
ఇండియాలో రెస్టారెంట్, బార్ లో ఉండే ఐటెమ్స్ ట్రెండింగ్ లోకి రావడంతో.. పోర్న్ స్టా్ర్ మార్టినీ గురించి తెగ వెతికారట మన భారతీయులు. పేరు కాస్త బోల్డ్ గా ఉండటంతో.. ఇందేటా అని గూగుల్ లో సెర్చ్ చేశారట.
మోదకాలు (Modak):
వినాయక చవితి రోజున భక్తులు రకరకాల ప్రసాదాలు చేసి.. గణనాయకునికి సమర్పిస్తారు. అందులో వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాల్లో మోదకాలు ఒకటి. వీటి గురించి నెటిజన్లు బాగా వెతికారట. పండుగ సందర్భంగా మోదకాలను ఎలా తయారు చేయాలో సెర్చి చేసినట్లు 3వ ప్లేస్ లో ఉంది ఈ ప్రసాదం.
తెకువా (Thekua):
బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఈ రెసిపీ ఫేమస్. యాలకుల ఫ్లేవర్ తో చేసే ఈ స్వీట్.. పాన్ ఇండియాలో ఇటీవల ఫేమస్ అయ్యింది. ఛట్ పూజా సందర్భంగా గూగుల్ చేయగా.. దీన్ని ఎక్కువ మంది చూసినట్లు గూగుల్ తెలిపింది.
ఉగాది పచ్చడి:
తెలుగు రాష్ట్రాలలో.. తెలుగు సంవత్సరం ప్రారంభ దినోత్సవమైన ఉగాది రోజు తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా తయారు చేసుకునే రెసిపీ గురించి దేశ వ్యాప్తంగా తెగ సెర్చ్ చేశారట.తీపి, పులు, వగరు, కారం.. ఇలా షడ్రుచులను టేస్ట్ చేసేందుకు తయారీ కోసం చేసిన సర్చ్ లో టాప్ సర్చ్ లిస్టులోకి వచ్చింది.
బీట్‌రూట్ కంజీ:
గట్ హెల్త్ కోసం ఇప్పుడు చాలా మంది పులియబెట్టిన (ఫర్మెంటేషన్) పదార్థాలను తీసుకుంటున్నారు. అందులో టాప్ ప్లేస్ లో ఉంది బీట్‌రూట్ కంజి. ఈ శక్తివంతమైన ప్రోబయోటిక్ కూలర్ దాని రంగు,పేగు-ఆరోగ్య ప్రయోజనాల కోసం Gen Z ని ఆకర్షించింది.పగూగుల్ సెర్చ్ లో టాప్ 10 లో చేర్చింది.
తిరువతిరై కాళి:
బియ్యం, బెల్లం , నెయ్యితో తయారు చేయబడిన ఈ తమిళ రుచికరమైన తీపి వంటకం తిరువతిరై పండుగ సందర్భంగా తయారు చేస్తారు. ఎక్కువ మంది ఇంట్లో సాంప్రదాయ వంటకాలనుతయారు చేయాలని ఇష్టపడుతుండటంతో గూగుల్ లో సెర్చ్ చేయడం పెరిగింది.
►ALSO READ | Garden Tips: బయటే కాదు.. కిచెన్.. బెడ్ రూమ్.. హాల్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చు.. ఎలాగంటే..!
యార్క్‌షైర్ పుడ్డింగ్:
ఇండియాలో టాప్ 10 శోధనలలో ఒక క్లాసిక్ బ్రిటిష్ సైడ్ డిష్ చోటు దక్కించుకుందా? అంటే అవుననే చెప్పాలి. వైరల్ క్రిస్మస్ మెనూలు, ఎయిర్-ఫ్రైయర్ హ్యాక్స్, హాలిడే-సీజన్ వంట కంటెంట్ ఈ బంగారు రంగు, గ్రేవీ-ప్రియమైన రుచికరమైన వంటకానికి ఊహించని అభిమానాన్ని ఇచ్చాయి.
గోండ్ కటిరా :
ఎండా కాలంలో వేడి గాలుల సమయంలో ఈ కూలింగ్ రెసిన్ ఆధారిత తయారు చేసిన పదార్థం నెటిజన్లను బాగా ఆకర్షించింది. పానీయాలు, డెజర్ట్‌లు, ఆరోగ్య టానిక్‌లలో గోండ్ కటిరాను ఎలా నానబెట్టాలి, ఎలా ఉపయోగించాలి అనే కోణంలో బాగా వెతికారట ఇండియన్స్.
కొలుకట్టై (కుడుములు) :
సౌత్ ఇండియాలో ఫేమస్ వంటకం అయిన కుడుములు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. వినాయక చతుర్థి సందర్భంగా తెలుగు, తమిళ ప్రజలు ఇష్టంగా చేసుకునే వంటకాల్లో ఇదీ ఒకటి. రుచికరమైనది లేదా తీపి అయినా, ఈ ఉడికించిన కుడుములు సంవత్సరంలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ విందులలో గూగుల్‌లో ఉన్నాయి.
