Garden Tips: బయటే కాదు.. కిచెన్.. బెడ్ రూమ్.. హాల్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చు.. ఎలాగంటే..!

Garden Tips:   బయటే కాదు.. కిచెన్.. బెడ్ రూమ్.. హాల్లో  కూడా మొక్కలు పెంచుకోవచ్చు.. ఎలాగంటే..!

ఇంట్లో పచ్చదనం ఉంటే మనసుకి హాయిగా ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇళ్లలో అందం కోసం, అలంకరణ కోసం తీగలు, పూల మొక్కలు, ముళ్ల చెట్లు మాత్రమే కాదు, ఆహారం కోసం, ఆరోగ్యం కోసం ఆకు కూరలు, కూరగాయల మొక్కలు, ఔషధ మొక్కలు... వంటివి పెంచుకోవడానికి కొంచెం స్థలం చాలు. అయితే ఏ మొక్కల్ని ఎక్కడ పెంచాలి... ఎలా పెంచాలి.... అవగాహన ఉంటే ఇంటిని పచ్చదనంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.  అలా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. . !

వంటగది :ఆడవాళ్లు ఎక్కువ సమయం ఉండేది కిచెన్ లోనే. కాబట్టి వంటగదిని అనుకుని
బాల్కనీ ఉంటే మెంతికూర, కొత్తిమీర పుదీనా వంటి ఆకుకూరలను పెంచండి. తగినంత వెలుతురు అందినప్పుడు ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. అంతేకాకుండా అవసరానికి కూడా ఉపయోగపడతాయి. చిన్న చిన్న కుండీలు, పనికిరాని డబ్బాలు, ట్రేలలో కూడా పెంచుకోవచ్చు.

లివింగ్ రూమ్ (హాల్​) : ఇంట్లోకి వచ్చిన వారిని ఆకట్టుకోవాలంటే లివింగ్ రూమ్ లో ఒకటి రెండు మొక్కలు ఉండే తీరాల్సిందే. వెలుతురు లేకపోయినా చక్కగా పెరిగే మొక్కలను ఎంచుకోవచ్చు. అలాంటి మొక్కల్లో అరికా పామ్. పీస్ లిల్లీ, ఫిలడెండ్రాన్ వంటివి చూడ్డానికి బాగుంటాయి. ఈ మొక్కలపై నాసా నిర్వహించిన క్లీన్ ఎయిర్" అధ్యయనంలో గాలిని శుద్ధిచేసే గుణాలున్నట్టు గుర్తించారు. హాల్లో సక్యులెంట్లతో రూపొందించిన చిన్న టెర్రారియంలనూ ఉంచుకోవచ్చు. జొన్సాయ్ లూ ప్రయత్నించొచ్చు.

బెడ్ రూమ్ :  బెడ్రూమ్​ లో  పెంచుకునేందుకు సువాసనతో పాటు ఆహ్లాదాన్ని కలిగించే మల్లె గార్దేనియా వంటి మొక్కల ఎంచుకోవచ్చు. ఇప్పుడంతా పడకగదికి వెలుతురు సరిగా అందాలని కోరుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఇంటి నిర్మాణాలు ఉంటున్నాయి. కాబట్టి వెలుతురు కోసం పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. బెడ్ రూం కిటికీ దగ్గర వెలుతురు పడేలా వీటిని పెట్టుకోవచ్చు లేదంటే బెడ్​ రూమ్​ను ఆనుకుని బాల్కనీ ఉంటే అక్కడ పెంచుకోవచ్చు. అలంకరణ కోసం లక్ష్మీబాంబు, మనీప్లాంట్ వంటి మొక్కలను కూడా పెట్టుకోవచ్చు..

–వెలుగు,లైఫ్​–